ఓమ్ అస్మత్ గురుభ్యో నమః
శ్రీరామాయణం గ్లోబల్ కాంటెస్ట్ పరీక్షా తేదీల వివరాలు
శ్రీరామాయణం గ్లోబల్ కాంటెస్ట్ పరీక్షా తేదీల వివరాలు
జైశ్రీమన్నారాయణ
ఆచార్యుల మంగళాశాసనాలతో అందిస్తున్న శ్రీరామాయణరసామృతాన్ని, సంసారరోగనివారిణి మీరంతా ప్రతిరోజూ శ్రీరామాయణ ప్రశ్నావళి రూపంలో ఆస్వాదిస్తూ, జవాబులిచ్చే క్రమంలో శ్రీరామచరితని కనీసం రెండు ఆవృత్తులు పూర్తిచేసి ఉంటారని భావిస్తున్నాం.
శ్రీరామాయణ రసవాహినిలో మనమెంత వరకు అవగాహించ గలిగామో, అర్థం చేసుకోగలిగామో పరీక్షించుకునేందుకు ఈ క్రింది తేదీలలో సిద్ధంగా ఉందాము.
- క్వార్టర్ ఫైనల్ – డిసెంబర్, 25వ తేదీ
- సెమీ ఫైనల్ – జనవరి, 20వ తేదీ
- ఫైనల్ – ఫిబ్రవరి, 24వ తేదీ మరిన్ని వివరాలు త్వరలోనే మీకందజేస్తాము.
- ప్రస్తుతము రాబోయే క్వార్టర్ ఫైనల్ కి, నిత్యం అందుకునే ప్రశ్నావళికి ఉండే మార్పులని గమనించి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందామిలా.
- క్వార్టర్ ఫైనల్స్ లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
- సమయం మీరు ప్రారంభించిన క్షణం నుండి 90 ని.లోపు అన్ని ప్రశ్నలు పూర్తిచేయవలసి ఉంటుంది. 90.ని తర్వాత పరీక్ష పూర్తయిపోతుంది.
- ఒకరు ఒక్కసారి మాత్రమే జవాబులివ్వగలుగుతారు. ప్రతిరోజూ లాగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించలేరు.
- ప్రశ్నల విధానం మాత్రం మనం ప్రతినిత్యం చేసే విధంగానే ఉంటాయి. అయితే, ప్రతి ప్రశ్నకు మీ జవాబు సరైనదా, కాదా అన్నది మీకు వినిపించరు. రోజూలాగ సరైన సమాధానం ఏమిటి అన్నది కూడా ప్రదర్శించరు. మీరు ప్రశ్న పై ఇచ్చిన సూచనని గమనించి ఒక జవాబా, ఒకటి కంటే ఎక్కువా అన్నది గమనించి జాగ్రత్తగ జవాబులు పెట్టండి.
- పరీక్ష ఇవ్వడానికి ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా ఉండే ప్రదేశంలో, ఎలాంటి గందరగోళం లేని ప్రదేశం చూసుకుని ప్రారంభించండి. వీలయినంతవరకు ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్ మీద చేసే ప్రయత్నం చేయండి. లేని వారు ఫోన్ లోనే చేయండి.
- మన భారతీయ సమయం ప్రకారం, డిసెంబర్, 25వ తేదీ ఉదయం 6.గం.ల నుండి, 26వ తేదీ ఉదయం 6 గం.ల వరకు 24 గం.లలో మీకు అనుకూలమైన 90.ని.ల సమయాన్ని ప్రశాంతంగ కేటాయించుకోండి. మీరు ప్రారంభించిన క్షణం నుండి 90.ని.ల వరకే మీకు అవకాశం ఉంటుందన్నది మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు.
- మీ వ్యక్తిగత పరీక్షా ఫలితాలని 24 నుండి 48 గం.లలోపు మన వెబ్ సైట్ ద్వారా గానీ, మీ కాంటాక్ట్ నెం. ద్వారా గానీ తెలియజేస్తారు.
- ఇవన్నీ రిజిస్టర్ అయిన వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇంతవరకు కాని వారికి డిసెంబర్ 24వ తేదీ వరకు మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంది. కనుక, మీ బంధుమిత్రులకి తెలియజేయగలరు. (రిజిస్ట్రేషన్ లింక్)
మీ అందరికీ శుభాకాంక్షలతో… శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి సన్నిధిలో జరిగే ఫైనల్ పరీక్షకి కలుద్దామని ఆశిస్తూ…
శ్రీ సీతారామానుగ్రహంతో మీ విజయాన్నీ ఆకాంక్షిస్తూ….
జైశ్రీమన్నారాయణ!
- Shed your ego. Serve all beings as service to God.
- Serve society which is the universal form of God.
- Nobody is infallible.
- Do not humiliate anyone.
- What is of supreme importance is purity of mind and deed