Divine Arjitha Sevas for Donors

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి సంకల్పంతో లోకమంతటికి సమతాస్ఫూర్తిని పరిమళింపజేస్తూ Statue of Equality లో 108 దివ్యదేశాల పెరుమాళ్ళతో భగవద్ రామానుజులు అవతరించి 3 సంవత్సరములు సుసంపన్నమైనాయి. లోకమంతా ఇలా అనుగ్రహింపబడటానికి శ్రీస్వామి వారి దివ్య సంకల్పం సాకారం కావడం లో మీరు చూపిన ఆర్తి, ప్రేమ, శ్రధ్ధ సర్వదా శ్లాఘనీయం స్మరణీయములు.అందుకే 108 దివ్యదేశముల పెరుమాళ్ళ అనుగ్రహం ఆచార్య మంగళాశాసనములుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు అందించుట కోసం Statue of Equality లో దివ్య దేశ పెరుమాళ్లకు జరిగే అత్యద్భుతమైన ఆర్జిత సేవలలో పాల్గొనుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

  • ఆర్జిత సేవల సమయం :
  • 5:30 am – సుప్రభాతం
  • 6:30 am – అభిషేకం
  • 7:00 am – కళ్యాణ మహోత్సవం
  • 8:30 am – తీర్థ గోష్టి , బాలభోగం
  • 9:00 am – సుదర్శన హోమ కార్యక్రమం
  1. పై కార్యక్రమములో పాల్గొనుట కొరకు మీరు 5 గంటలకు Statue of Equality కి రావలసి ఉంటుంది.
  2. అందుకోసం మీరు కోరినట్లయితే ముందురోజు దంపతులకు , ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు మొత్తం 4 సభ్యులకు వసతి సౌకర్యం ముందు రోజు ఉచితముగా ఏర్పాటు చెయ్యబదుతుంది. ప్రతిరోజు వసతి 5 కుటుంబములకు మాత్రమే అందిచబడుతుంది.
  3. వసతిని పొందదలచినట్లైతే మీరు ముందు రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు చేరుకోగలరు.
  4.  మా కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతించి వసతి సౌకర్యం ఏర్పాటు చేసి ఆ రోజు సాయంకాలం సమతా నీరాజనం మరియు లేజర్ షో (లీలాజల నీరాజనం) తదుపరి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు.
  5.  మరుసటి రోజు ఉదయం మిమ్మల్ని తోడ్కోని Statue of Equality లో ఆర్జిత సేవ జరిగే దివ్యదేశం వద్దకు చేరుస్తారు.
  6. కార్యక్రమం మధ్యలో బాలభోగం చివరిలో రాజభోగ ప్రసాదం అందిస్తారు.

ప్రశాంతమైన మనస్సుతో దివ్యదేశ పెరుమాళ్ కి జరిగే సేవలని తరించండి.
మీ శ్రేయస్సుని కోరి 108 దివ్యదేశ పెరుమాళ్ళ, మరియు భగవద్ రామనుజుల వారి కృపను వేద ఆశీర్వచనంగా పొందండి. దివ్యానుభవాన్ని మనస్సునిండా నింపుకోండి.
ఈ క్రింద మీ వివరములను అందించగలరు.

With the divine sankalpam of HH Chinna Jeeyar Swamiji, the spirit of equality has spread across the world through the Statue of Equality, where Bhagavad Ramanujacharya manifested along with the 108 Divya Desam Perumals. It has now been three glorious years since this divine blessing.

The devotion, love, and faith you have shown in making Swamiji’s divine sankalpam a reality, blessing the entire world, are always commendable and memorable.

Therefore, to extend to you and your family the grace of the 108 Divya Desam Perumals as Acharya Mangalasasanams, we warmly invite you to participate in the extraordinary Arjitha Sevas offered to the Divya Desam Perumals at the Statue of Equality.

Arjitha Seva Timings:

  • 5:30 AM – Suprabhatham
  • 6:30 AM – Abhishekam
  • 7:00 AM – Kalyana Mahotsavam
  • 8:30 AM – Theertha Goshti & Bala Bhogam
  • 9:00 AM – Sudarshana Homam

👉 To participate in the above programs, you are requested to arrive at the Statue of Equality by 5:00 AM.

👉 For your convenience, if desired, accommodation will be provided free of cost for one couple with one or two children (maximum 4 members per family) on the previous day. Accommodation is limited to only 5 families per day.

👉 Those wishing to avail accommodation should arrive by 3:00 PM on the previous day.

Our volunteers will welcome you, arrange your stay, and provide you with the opportunity to attend Samatha Nirajanam and Laser Show (Leelajal Nirajanam) in the evening, followed by dinner.

On the next morning, our team will accompany you to the designated Divya Desam inside the Statue of Equality where the Arjitha Sevas will be held. During the program, you will be offered Bala Bhogam prasadam, and at the end, Rajabhogam prasadam.

With a serene mind, participate in these divine services offered to the Divya Desam Perumals. May you and your family be blessed with the grace of the 108 Divya Desam Perumals and Bhagavad Ramanujacharya, showered upon you as Vedic blessings. Fill your heart with this divine experience.

👉 Please provide your details below.

Statje_of_Equality_logo_with_title_copy-removebg-preview

Jai Srimannarayana

Registration

Stay Connected with Statue of Equality & Teachings of Sri Ramanujacharya